TG24TV
రచయిత
కుటుంబ సమేతంగా తరలివచ్చి మహోత్సవాన్ని విజయవంతం చేయాలి – ఈగ మల్లేశం
TG24TV
రచయిత
కుటుంబ సమేతంగా తరలివచ్చి మహోత్సవాన్ని విజయవంతం చేయాలి – ఈగ మల్లేశం

వరంగల్, నవంబర్ 26 (టీజీ 24): ఆధ్యాత్మికత, ఆత్మీయతల మేళవింపుగా పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ వార్షిక కార్తీక మాస వనభోజన మహోత్సవ పోస్టర్ను అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. డిసెంబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం ఖిలా వరంగల్లోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రవేశద్వారం, ఉత్తరకోట వద్ద వనభోజన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్తులు, మహిళలు, యువతీ యువకులు కుటుంబ సమేతంగా హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఈగ మల్లేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, కుస్మ సతీష్, మార్గం ఎల్లయ్య, బి.ఎస్. మూర్తి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.