T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్దవంగర మండల కాంగ్రెస్ అధ్యక్షుడి తల్లికి కాంగ్రెస్ నాయకుల నివాళి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్దవంగర మండల కాంగ్రెస్ అధ్యక్షుడి తల్లికి కాంగ్రెస్ నాయకుల నివాళి

రాయపర్తి, ఆగస్టు 01(టీజీ 24): పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం కోరీపల్లి గ్రామంలో పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగు మురళి తల్లి రంగు వినోద అనారోగ్యంతో మృతి చెందారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరిపెల్లి వెళ్లి వినోద పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాయపర్తి మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మండల పార్టీ నాయకుడు రెంటాల గోవర్ధన్ రెడ్డి, పెద్దవంగర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిసు హరికృష్ణ, తొర్రూరు టౌన్ యూత్ అధ్యక్షుడు భాష బోయిన మహేష్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.