T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన

వర్ధన్నపేట, జులై 22 (టీజీ 24): వరంగల్‌లోని పోషమ్మైదానం సర్కిల్‌లో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం, రాష్ట్ర నాయకుడు మన్నే బాబు రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండిస్తూ, నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.