T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ నిరసన

నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ నిరసన

నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ నిరసన

రాయపర్తి, జులై 22 (టీజీ 24):వరంగల్‌లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అయూబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. రాయపర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.