T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీపీ శ్వేత

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీపీ శ్వేత

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీపీ శ్వేత

వరంగల్, జూలై 21 (టీజీ 24): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి పోలీస్ అవుట్‌పోస్ట్ పనితీరు, మెడికో-లీగల్ కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీ-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించి మత్తు పదార్థాలకు బానిసైన యువతకు అందిస్తున్న చికిత్సపై వైద్యులతో చర్చించారు. అలాగే ఆస్పత్రి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ నిర్వహణ, ప్రధాన ద్వారం వద్ద ఆటోలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.