T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏచూరి ఆశయాల సాధనకు పోరాడాలి సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్

ఏచూరి ఆశయాల సాధనకు పోరాడాలి సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్

ఏచూరి ఆశయాల సాధనకు పోరాడాలి  సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్

మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (టీజీ 24): లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహా నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు. సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్‌లోని సీతారాం ఏచూరి నగర్‌లో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాధుల శ్రీనివాస్ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు ఏచూరి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రజలను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్, సమ్మెట రాజమౌళి, రావుల రాజు, నాగన్న, వెంకన్న, భాగ్యమ, రజాక్, మహీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.