T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్ ను పునరుద్ధరించాలి

సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్ ను పునరుద్ధరించాలి

సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్ ను పునరుద్ధరించాలి

తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ కో-కన్వీనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు శాపంగా మారిందని, వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోరెల్లి వెంకటేష్ మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగుల హక్కు అని, పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా నాయకులు శాంతన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు ఏ. వెంకటేష్, చంద్రశేఖర్, చంద్రుడు, బద్రు నాయక్, మల్లికార్జున్, శ్రీధర్, గోపీనాథ్, బాలాజీ, కిరణ్ కుమార్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

Vikarabad News