T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా దాసి రాందేవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా దాసి రాందేవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా  దాసి రాందేవ్ జన్మదిన వేడుకలు

వరంగల్, సెప్టెంబర్ 15.(టీజీ 24): వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసి రాందేవ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వెంకట్రామ జంక్షన్ సమీపంలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ , మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో దాసి రాందేవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజా సేవలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలుద్దీన్, మహూద్ పాషా, ఇట్యాల సతీష్, మీర్జా అజామ్ అలీ, సాధిక్, శ్రీపాద సతీష్, నాంపల్లి యాదగిరి తో పాటు తదితరులు పాల్గొని దాసి రాందేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు…