TG24TV
రచయిత
నందన్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
TG24TV
రచయిత
నందన్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్

వరంగల్, ఆగస్టు 19.(టీజీ 24) : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చార్బౌలి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నందన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ తాటి శిరీషా–ప్రశాంత్ దంపతులకు అయూబ్ శుభాకాంక్షలు తెలిపారు. చార్బౌలి ప్రాంత ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మహమ్మద్ అయూబ్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ.. చార్బౌలి ప్రాంతంలో శ్రీ నందన్ హాస్పిటల్ ఏర్పాటు కావడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆసుపత్రి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.