T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి

పటాన్చెరు, జూలై 6 (టీజీ24): డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం పటాన్చెరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా జగ్జీవన్ రామ్‌ను ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు