
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు, జూలై 06(టీజీ 24) బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. సోమవారం ఉదయం శంభీపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని అభిలాషించారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి
పటాన్చెరు, జూలై 6 (టీజీ24): డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం పటాన్చెరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా జగ్జీవన్ రామ్‌ను ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

SIR పై అప్రమత్తంగా ఉండాలి-ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, జూలై 6 (టీజీ 24): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటు కీలకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌పై ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం, బూత్ లెవెల్ అధికారులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్‌షిప్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇష్టంతో చదవండి.. లక్ష్యాన్ని సాధించండి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూలై 6:(టీజీ 24) ఇష్టపడి చదివి, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు రూ.5,000 చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.