T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కోమాండ్ల మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఈగ మల్లేశం

కోమాండ్ల మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఈగ మల్లేశం

కోమాండ్ల మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఈగ మల్లేశం

వర్ధన్నపేట, జూలై 20 (టీజీ 24): వర్ధన్నపేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి తండ్రి కోమాండ్ల మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సోమవారం వారి స్వగృహానికి వెళ్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోమాండ్ల ఎలేందర్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిలివేరు కుమార్, కోమాండ్ల వెంకట్ రెడ్డి, కరిమిళ్ళ వెంకటేశ్వర్లు, కోమాండ్ల సాయి రెడ్డి, పెద్దూరి రాజకుమార్, కుడికందుల సంపత్, బక్కతట్ల రాజు, పూజారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.