T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సట్ల యాదగిరి గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఈగ మల్లేశం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సట్ల యాదగిరి గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఈగ మల్లేశం

వర్ధన్నపేట, ఆగస్టు 09 (టీజీ 24): వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సట్ల యాదగిరి గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆదివారం ఇల్లందలోని మృతుడి స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యాదగిరి గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంచాల కుమారస్వామి, అడపా రాజు, సమ్మెట సూర్యనారాయణ, సట్ల సదానందం, సట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.