T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చిందు కళాకారుడి కుటుంబాన్ని పరామర్శించిన ఈగ మల్లేశం

చిందు కళాకారుడి కుటుంబాన్ని పరామర్శించిన ఈగ మల్లేశం

చిందు కళాకారుడి కుటుంబాన్ని పరామర్శించిన ఈగ మల్లేశం

వర్దన్నపేట, ఆగస్టు 09 (టీజీ 24): ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన సీనియర్ యక్షగాన చిందు కళాకారుడు గజవెల్లి భుజంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆదివారం పంథిని గ్రామంలోని మృతుడి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా భుజంగం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఈగ మల్లేశం, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిందు కళారంగానికి భుజంగం అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జన్ను రాములు, గజవెల్లి ప్రభాకర్, కుటుంబ సభ్యులు గజవెల్లి అమరేందర్, గజవెల్లి శ్రీశైలం, గజవెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.