T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాళోజీకి ఎర్రబెల్లి ఘన నివాళి

కాళోజీకి ఎర్రబెల్లి ఘన నివాళి

కాళోజీకి ఎర్రబెల్లి ఘన నివాళి

వరంగల్, సెప్టెంబర్ 09 (టీజీ 24 ): కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గొడవను తన గొడవగా చేసుకుని ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి, కాళోజీ అవార్డు, వరంగల్ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు, హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు వంటి కార్యక్రమాలను గత ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. కాళోజీ రచనలు, ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.