TG24TV
రచయిత
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన వేణు చేయూత
TG24TV
రచయిత
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన వేణు చేయూత

రాయపర్తి, ఆగస్టు 18 (టీజీ 24):. మండలం లోని పెరికేడు గ్రామానికి చెందిన రావిపాటి పెద్దబ్బాయి కుమారుడు వేణు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. పాఠశాలలో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన స్టేజి లేకపోవడాన్ని గుర్తించిన ఆయన స్పందించారు. తన సొంత నిధులతో రూ.2 లక్షల 20 వేల వ్యయంతో ఆకర్షణీయమైన స్టేజి ఆవరణాన్ని నిర్మించి ప్రభుత్వ పాఠశాలకు అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం వేణు చేసిన ఈ సేవను గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులోనూ పెరికేడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని వేణు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రవాసులు, గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల సాయిలు, ఉపసర్పంచ్ రమేష్, ప్రధానోపాధ్యాయులు మిత్తింటి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.