TG24TV
రచయిత
కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల అసత్య ప్రచారం
TG24TV
రచయిత
కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల అసత్య ప్రచారం

కురవి, సెప్టెంబర్ 4 (టీజీ 24): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కురవి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ, 67 వేల ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ కృషితో కురవిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింహులపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, మరిపెడలో 50 పడకల ఆసుపత్రి, మున్సిఫ్ కోర్టు, వ్యవసాయ మార్కెట్, డోర్నకల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.