T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగు కుటుంబాలకు ఆర్థిక సహాయం. అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 20 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగు కుటుంబాల వ్యక్తులు వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చిర్ర ఈరమ్మ, లింగాల కొమురయ్య, లింగాల మైసమ్మ, చిర్ర ఐలయ్య చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వారి ఇళ్ల వద్ద పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం SRR ఫౌండేషన్ తరఫున వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య, బొమ్మినేని సురేందర్ రెడ్డి, చిర్ర బిక్షపతి, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, సాయి కిరణ్, అనిల్, నరేష్, కోలా పున్నం తదితరులు పాల్గొన్నారు.