T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, సెప్టెంబర్ 23 (టీజీ 24) వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్‌పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, PACS వైస్ చైర్మన్ చిట్యాల వెంకటేశ్వర్లు కుమార్తె సిరిచందన, కుమారుడు అన్విత్‌ల నూతన వస్త్ర, ఫల, పుష్పాలంకరణ, దోతి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.