TG24TV
రచయిత
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
TG24TV
రచయిత
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పర్వతగిరి, సెప్టెంబర్ 18 (టీజీ 24): పర్వతగిరి మండలంలోని పలు కుటుంబాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. హన్మకొండలో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన హెచ్‌ఎం వర్ధినేని వసంతరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం నారాయణపురం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి వెంకటరావు కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే బూర్గుమాళ్ల సర్పంచ్ ఎలికట్టే కృష్ణవేణి–వేణు తల్లి, పర్వతగిరికి చెందిన బాసాని ఉప్పలయ్య కుమార్తె రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.