T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్దతండా ఆటో డ్రైవర్ల నిరసనకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్దతండా ఆటో డ్రైవర్ల నిరసనకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం

కురవి, సెప్టెంబర్ 06 (టీజీ 24): కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామదేవత బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆటో డ్రైవర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా సత్యవతి రాథోడ్ స్వయంగా ఆటో నడిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.