TG24TV
రచయిత
పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
TG24TV
రచయిత
పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వర్ధన్నపేట, జూలై 18 (టీజీ 24): వర్ధన్నపేట, నియోజకవర్గ కేంద్రానికి చెందిన మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలెందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి మరణించగా వారి పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఇల్లంద గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పిట్టల జ్యోతి భర్త రమేష్ మరణించగా, ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి (నాగపురం) గ్రామానికి చెందిన అనుమూల రాములు మరణించగా, వర్ధన్నపేటకు చెందిన రాజిడి వాసుదేవ రెడ్డి తల్లి సరోజన ఇటీవల మరణించగా వారి పార్థివ దేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండాకు చెందిన మాలోత్ రాజు విద్యుత్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.