TG24TV
రచయిత
గారె బిక్షపతి కి. ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
గారె బిక్షపతి కి. ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 01 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేడు గ్రామానికి చెందిన గారే బిక్షపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స పొందుతూ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గారె బిక్షపతి కి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సహాయాన్ని రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంకినేని ఎల్లస్వామి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నల రాజబాబు, మాజీ ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, పార్టీ ముఖ్య నాయకులు భాషబోయిన సుధాకర్, మల్లంపెల్లి యాకయ్య, గొడుగు యాకయ్య, దేవేంద్ర చారి, పుట్ట అశోక్ తదితరులు పాల్గొని అందజేశారు.