T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ వెంటనే అమలు చేయాలి-గిద్దె రాజేష్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ వెంటనే అమలు చేయాలి-గిద్దె రాజేష్

హైదరాబాద్, జూలై 6 (టీజీ24): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచడం, ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.