పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగుల ఆందోళన

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగుల ఆందోళన

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌లో కేవలం 5,000 పోస్టులు మాత్రమే ప్రకటించడంపై నిరుద్యోగులు సోమవారం హైదరాబాద్‌లోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. పోస్టుల సంఖ్యను పెంచి ఎక్కువ మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అయితే, ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, చట్టం, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ వెంటనే అమలు చేయాలి-గిద్దె రాజేష్

వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ వెంటనే అమలు చేయాలి-గిద్దె రాజేష్

హైదరాబాద్, జూలై 6 (టీజీ24): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచడం, ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో ఉస్తం శ్రీనివాస్ చేరిక

కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో ఉస్తం శ్రీనివాస్ చేరిక

కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో ఉస్తం శ్రీనివాస్ చేరిక హైదరాబాద్,టీజీ 24 టీవీ : తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉస్తం శ్రీనివాస్ తెలంగాణ రక్షణ సేనలో చేరారు. పెద్దపల్లి జిల్లా బాధ్యులు సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘాల రాష్ట్ర జేఏసీ అధికార ప్రతినిధి, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సామాజిక విశ్లేషకుడు, నేషనల్ అవార్డు గ్రహీత, బహుజన సాహిత్య అకాడమీ మరియు తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపకుడు ఉస్తం శ్రీనివాస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత పార్టీ కండువా కప్పి ఉస్తం శ్రీనివాస్‌ను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బొంగోని శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచకప్‌ విజేత పెరుమాళ్ల ప్రదీప్ కుమార్‌కు డీజీపీ అభినందనలు

ప్రపంచకప్‌ విజేత పెరుమాళ్ల ప్రదీప్ కుమార్‌కు డీజీపీ అభినందనలు

ప్రపంచకప్‌ విజేత పెరుమాళ్ల ప్రదీప్ కుమార్‌కు డీజీపీ అభినందనలు మర్యాదపూర్వకంగా కలిసిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్.. సేవాస్ఫూర్తి, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించిన డీజీపీ హైదరాబాద్, జూలై 10: ఈజిప్టు రాజధాని కైరోలో ఇటీవల జరిగిన పవర్ లిఫ్టింగ్ ప్రపంచకప్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో వెండి పతకం సాధించి తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మాజీ అకౌంట్స్ ఆఫీసర్, రిటైర్డ్ గెజిటెడ్ అధికారి పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో ప్రపంచకప్‌లో సాధించిన వెండి పతకాన్ని ప్రదీప్ కుమార్ డీజీపీకి చూపించారు. ఆయన అసాధారణ విజయాన్ని అభినందించిన డీజీపీ, అంతర్జాతీయ వేదికపై తెలంగాణతో పాటు భారతదేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. పోలీసు శాఖలో అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ సేవా కాలంలోనూ, పదవీ విరమణ అనంతరం కూడా క్రీడలపై అంకితభావంతో సాధన కొనసాగించి ప్రపంచ స్థాయిలో రాణించడం ఎంతో ఆదర్శప్రాయమని డీజీపీ కొనియాడారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే ఏ వయసులోనైనా అత్యున్నత విజయాలు సాధించవచ్చని ప్రదీప్ కుమార్ నిరూపించారని ప్రశంసించారు. ప్రపంచకప్ పోటీల్లో 82.5 కిలోల వెయిట్ కేటగిరీలో మొత్తం 400 కిలోల బరువును ఎత్తి వెండి పతకాన్ని కైవసం చేసుకున్న ప్రదీప్ కుమార్‌కు డీజీపీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పనిచేసిన సమయంలో లభించిన క్రమశిక్షణ, సేవాభావమే తన క్రీడా జీవితానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు. డీజీపీ నుంచి లభించిన అభినందనలు తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాయని, రాబోయే అంతర్జాతీయ పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ, భారతదేశానికి మరిన్ని విజయాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ భేటీ సందర్భంగా పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొని ప్రదీప్ కుమార్‌ను అభినందించారు. రిటైర్డ్ ఉద్యోగిగా ప్రపంచ వేదికపై పతకం సాధించి పోలీసు శాఖకు, తెలంగాణకు గౌరవం తీసుకురావడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.