TG24TV
రచయిత
నందనం సొసైటీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
TG24TV
రచయిత
నందనం సొసైటీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వర్దన్నపేట, ఆగస్టు 15 (టీజీ 24): ఐనవోలు మండలంలోని నందనం సొసైటీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందనం సొసైటీ చైర్మన్, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, గ్రామ సర్పంచ్ రోజు, వార్డు సభ్యులు, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ రాజేష్ కన్నా, సీఈఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు.