TG24TV
రచయిత
లహరి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
TG24TV
రచయిత
లహరి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయపర్తి, ఆగస్టు 15 (టీజీ 24): మండల కేంద్రంలోని లహరి పబ్లిక్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ టీ. రవిచందర్ స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. వివిధ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆఫీస్ పాషా–నెహ్రూ, వర్షిత, రియాన్సిక, ఎన్. రాజేశ్వరి – భారతమాత, సహారా – ఝాన్సీ లక్ష్మీబాయి, మేఘన, తేజశ్రీ, శ్రణవి – రుద్రమదేవి, రాజేశ్వరి, యష్ణ వర్ధన్, నిత్యశ్రీ, మనుశ్రీ – తెలుగు తల్లి, వికిందర్ – అల్లూరి సీతారామరాజు, రిత్విక్ – మహాత్మా గాంధీ, అమిత్ పాషా – డా. బీఆర్. అంబేద్కర్ వేషధారణలో ఆకట్టుకున్నారు. రియాన్స్, శశివిక్, శ్రీకర్, రింశ పోలీసులుగా, జోహాన్, అశ్విన్, వర్షిత్, అబూతలహ, కార్తీక్, సమీరా ఆర్మీ సిబ్బంది వేషధారణలో, సహన్య, హదియా, ఎం. మనుశ్రీ, నక్షత్ర, నిష్మ త్రివర్ణ పతాక వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ. ఉమారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..