T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా YSR జన్మదిన వేడుకలు

ఘనంగా YSR జన్మదిన వేడుకలు

ఘనంగా YSR జన్మదిన వేడుకలు

తొర్రూరు, జూలై 08 (టీజీ 24): తొర్రూర్ పట్టణంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన రైతు, పేదల సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.