T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బదిలీపై వెళ్తున్న సీఐ శ్రీనివాసరావుకు ఘన సన్మానం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బదిలీపై వెళ్తున్న సీఐ శ్రీనివాసరావుకు ఘన సన్మానం

రాయపర్తి,సెప్టెంబర్ 02 (టీజీ 24 ): బదిలీపై వెళ్తున్న వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గబ్బెట బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావుకు శాలువా కప్పి సత్కరించి, ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. భవిష్యత్ విధుల్లో మరింత విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధి నిర్వహణలో సేవలందించిన శ్రీనివాసరావు సేవలను కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. బదిలీపై వెళ్తున్న సీఐను సన్మానించడం ద్వారా పోలీసు శాఖతో తమకు ఉన్న సానుకూల సంబంధాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమల నాయక్, మాజీ డైరెక్టర్ మునావత్ రవి, గబ్బెట యాకయ్య, యువజన నాయకులు చెడుపాక నాగేష్, అయిత శ్రావణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.