T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కులం పేరుతో దూషిస్తే చూస్తూ ఊరుకోం ఫ్లెక్సీ తొలగించాడనే నెపంతో యువకుడికి బెదిరింపులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: అంబేద్కర్ సంఘం, బీఎస్పీ
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కులం పేరుతో దూషిస్తే చూస్తూ ఊరుకోం ఫ్లెక్సీ తొలగించాడనే నెపంతో యువకుడికి బెదిరింపులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: అంబేద్కర్ సంఘం, బీఎస్పీ

దంతాలపల్లి, సెప్టెంబర్ 09 (తేజీ 24): దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామ మాజీ అధ్యక్షుడు దర్శనాల శ్రవణ్‌ను ఫ్లెక్సీ తొలగించాడనే నెపంతో కులం పేరుతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడ్డారని అంబేద్కర్ యువజన సంఘం, బీఎస్పీ నాయకులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ పి. శబరీష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కులం పేరుతో దూషించడం, బెదిరించడం ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని వారు స్పష్టం చేశారు. రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మారపు పవన్ కుమార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎల్. విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.