T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేలేరు PHCలో ఆరోగ్య సిబ్బంది సమావేశం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేలేరు PHCలో ఆరోగ్య సిబ్బంది సమావేశం

వేలేరు, జూలై 07 (టీజీ 24): వేలేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘన అధ్యక్షతన ANMs, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొని వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ, దోమల నివారణ చర్యలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై సూచనలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు, ఉప సర్పంచ్, HEOలు, ANMs, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.