T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు

రాయపర్తి, 24 సెప్టెంబర్ (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు దడిగేల నర్సమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో నర్సమ్మ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంటి కూలిపోవడంతో కుటుంబ సభ్యులు నివాసం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు స్పందించి, ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నర్సమ్మ కుటుంబానికి తక్షణ సహాయం అందించి, నష్టపరిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.