T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్షానికి కూలిన ఇల్లు.. నిరాశ్రయులైన వృద్ధ దంపతులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్షానికి కూలిన ఇల్లు.. నిరాశ్రయులైన వృద్ధ దంపతులు

రాయపర్తి, సెప్టెంబర్ 13 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఐత కొమురయ్య, ఆయన భార్య నివాసముంటున్న ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో వృద్ధ దంపతులు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. సంతానం కూడా లేకపోవడంతో వృద్ధాప్యంలో తమను ఆదుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండేందుకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పరిస్థితిని ప్రభుత్వం, అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణ సాయం అందించడంతో పాటు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కొమురయ్య దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.