TG24TV
రచయిత
పెద్ద చెరువులో మట్టి అక్రమ తరలింపు. పై చర్యలు తీసుకోవాలి
TG24TV
రచయిత
పెద్ద చెరువులో మట్టి అక్రమ తరలింపు. పై చర్యలు తీసుకోవాలి

కురవి, సెప్టెంబర్ 22 (టీజీ 24): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో పెద్ద చెరువులో మట్టిని అక్రమంగా తోడుతున్నారు. . చెరువులో మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రయత్నించగా, ఉపసర్పంచ్‌తో పాటు 10వ వార్డు సభ్యుడు “మేము అలాగే మట్టి తోడుకుంటాం.. నీకు దిక్కున్న చోట చెప్పుకో” అంటూ తనతో వాగ్వాదానికి దిగారని రామకృష్ణ ఆరోపించారు. అంతేకాకుండా, ఏ అధికారికి ఫిర్యాదు చేసినా తమకు భయం లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఇదే చెరువులో మట్టి తరలింపును అడ్డుకుని ప్రతి వాహనాన్ని నిలిపివేశామని, అప్పట్లో తమతో మాట్లాడిన కొందరు వ్యక్తులే ఇప్పుడు తనపై తిరగబడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై సంబంధిత అధికారులు వెంటనే పరిశీలన జరిపి, అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే తనపై జరుగుతున్న బెదిరింపులపై కూడా అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.