T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బంజారా సమాజం కోసం బంజారా భవన్ ప్రారంభం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

బంజారా సమాజం కోసం బంజారా భవన్ ప్రారంభం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

బంజారా సమాజం కోసం బంజారా భవన్ ప్రారంభం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ సూరారం శివాలయ నగర్‌లో బంజారా సమాజం కోసం నిర్మించిన బంజారా భవన్‌ను బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. కె.ఎం. పాండు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సొంత నిధులతో సుమారు రూ.12 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. బంజారా సమాజ ఆత్మగౌరవం, అభ్యున్నతికి ప్రతీకగా ఈ భవనాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో బంజారా సమాజం కీలక పాత్ర పోషించిందని, వారి అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, బంజారా సమాజ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

telangana