లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు

లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు

కూకట్‌పల్లి, లులు మాల్‌లో లులు ఆన్ సేల్’ ను నటుడు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘లులు ఆన్ సేల్’ లోగోతో పాటు టీ-షర్ట్‌ను ఆవిష్కరించారు. జూలై 9 నుంచి 12 వరకు నిర్వహించే ఈ మెగా సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, ఫుడ్ కోర్ట్‌తో పాటు మాల్‌లోని రిటైల్ స్టోర్లు ప్రత్యేక ఆఫర్లతో పాల్గొంటున్నాయని వెల్లడించారు. లులు హైపర్‌మార్కెట్‌లో 25 వేలకుపైగా ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు, ఫంతూరాలో 100 శాతం బోనస్ ఆఫర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూ.2,999 విలువైన షాపింగ్ చేసిన లులు హ్యాపీనెస్ సభ్యులకు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ i20 కారు గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లులు మాల్ రీజినల్ మేనేజర్ మహ్మద్ షరీఫ్, మాల్ మేనేజర్ ఏజిల్ అరసన్, డీజీఎం విశాల్ కుమార్, ఫంతూరా అసిస్టెంట్ మేనేజర్ సూర్యకాంత్, మార్కెటింగ్ మేనేజర్లు ఫణి, మను ఆంథోనీ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

మేడ్చల్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు. బోడుప్పల్‌లో జరిగిన సమావేశంలో నూతన జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి

సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి

ఉప్పల్‌లోని రామంతపూర్ భగాయత్ పరిధి వెంకటసాయి నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని తక్షణమే మంజూరు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు విజయేందర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు సీసీ రోడ్లు అత్యవసరమని ఆయన వివరించారు. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుని సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

సూరారం పి.యస్ ఆవరణలో కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి మీడియా సమావేశం..

సూరారం పి.యస్ ఆవరణలో కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి మీడియా సమావేశం..

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిందన్న అనుమానంతో సల్మా బేగం అనే మహిళపై దాడి చేసి, బలవంతంగా హార్పిక్ తాగించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితులు పరారీలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కైసర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై సమాచారం ఇచ్చిందనే కక్షతో నిందితులు సల్మా బేగం ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఘటనను ఆమె కుమార్తె వీడియో తీయగా మొబైల్‌ను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

హైదరాబాద్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) హైదరాబాద్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్‌లోని బాలకృష్ణ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్లాట్ నెం.90లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ బండు అథవాలే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భీమ్ రాజ్ సేన వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు కాంబ్లే రాజేష్ ఆహ్వానం మేరకు. సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్‌పై అవగాహన

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్‌పై అవగాహన

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల రామారం పరిధిలోని శ్రీనిధి గ్లోబల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పి శ్రీదేవి ఆధ్వర్యంలో పిల్లలకు పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించబడింది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్ పిల్లలకు పోలీస్ స్టేషన్ ఫై పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ పిల్లలు పోలీస్ స్టేషన్ వస్తే పిల్లలకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు