T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాజ్యాంగ స్ఫూర్తితోనే సమసమాజ నిర్మాణం సాధ్యం: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాజ్యాంగ స్ఫూర్తితోనే సమసమాజ నిర్మాణం సాధ్యం: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

వరంగల్, నవంబర్ 26 (TG24): భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలోని ప్రధాన ఆదర్శాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే సాధ్యమైందని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గురుకుల విద్యాసంస్థలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పథకాలను అమలు చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు.
ట్యాగ్‌లు
warangal brs partybrs partybrs mpVaddiraju Ravichandra