T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నూతన వధూవరులను ఆశీర్వదించిన జునుగొని రవి. బాల్యమిత్రులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన జునుగొని రవి. బాల్యమిత్రులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన  జునుగొని రవి.  బాల్యమిత్రులు

రాయపర్తి:, ఆగష్టు 26 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జోనగోని రవి కుమార్తె సహస్ర వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రవి క్లాస్‌మేట్స్‌ 1997–98 ఎస్సెస్సీ బ్యాచ్‌కు చెందిన బాల్య మిత్రులు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు సహస్ర దంపతులను ఆశీర్వదించారు. బాల్య స్నేహాన్ని కొనసాగిస్తూ సహస్ర దంపతులకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మిత్రులంతా కలిసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. రవి, షేక్ రఫీక్, ఎం.డి. ఫెరోజ్, ఎం.డి. అంజద్ ఖాన్, డి. యాకయ్య, ఎ. శంకరాచారి, జి. రాములు, ఎ. విష్ణు, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్య మిత్రుల స్నేహబంధం, పరస్పర సహకారం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.