TG24TV
రచయిత
శివాలయంలో సొంత ఖర్చులతో బోరు వేయించిన రిటైర్డ్ ఉద్యోగి కొమురయ్య
TG24TV
రచయిత
శివాలయంలో సొంత ఖర్చులతో బోరు వేయించిన రిటైర్డ్ ఉద్యోగి కొమురయ్య

వర్దన్నపేట, అక్టోబర్ 27 (టీజీ 24): వర్దన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్లో ఉన్న శివాలయంలో భక్తుల సౌకర్యార్థం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, సేవాతత్పరులు మోటపోతుల కొమురయ్య తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. ఆలయంలో నీటి అవసరాలను తీర్చేందుకు ఆయన ముందుకు వచ్చి చేసిన ఈ సేవ పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా భక్తుల సౌకర్యం కోసం బోరు వేయించిన కొమురయ్య సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా పరమశివుని ఆశీస్సులు మోటపోతుల కొమురయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పట్టణ ప్రజలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివాలయ పూజారి రామగిరి దేవేంద్రచారి, కోదాటి దేవేందర్ రావు, సిలివేరు శ్రీధర్ యాదవ్, గోధుమల మధుసూదన్, చిదిరాల రమేష్, గుజ్జ శ్రీధర్ రావు, మైస వీరేందర్, సిలివేరు శ్రీకాంత్ యాదవ్, గొల్లపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.