T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భద్రకాళి పోలీస్ కాలనీలో ఘనంగా కుంకుమార్చన
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భద్రకాళి పోలీస్ కాలనీలో ఘనంగా కుంకుమార్చన

తొర్రూరు, సెప్టెంబర్ 23 (టీజీ 24): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని భద్రకాళి పోలీస్ కాలనీలో మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా గణపతి పూజ నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి భాస్కర చారి, సులోచన, స్వప్న, రాధిక, భవాని తదితరులు పాల్గొన్నారు.