T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సూరారం పి.యస్ ఆవరణలో కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి మీడియా సమావేశం..
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సూరారం పి.యస్ ఆవరణలో కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి మీడియా సమావేశం..

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిందన్న అనుమానంతో సల్మా బేగం అనే మహిళపై దాడి చేసి, బలవంతంగా హార్పిక్ తాగించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితులు పరారీలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కైసర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై సమాచారం ఇచ్చిందనే కక్షతో నిందితులు సల్మా బేగం ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఘటనను ఆమె కుమార్తె వీడియో తీయగా మొబైల్‌ను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ట్యాగ్‌లు
telagnana