T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తండ్రిని కోల్పోయిన మహేష్ కుటుంబానికి బాల్యమిత్రుల పరామర్శ
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తండ్రిని కోల్పోయిన మహేష్ కుటుంబానికి బాల్యమిత్రుల పరామర్శ

రాయపర్తి, నవంబర్ 27 (టీజీ 24): రాయపర్తి మండల కేంద్రానికి చెందిన కారం ఉప్పలయ్య ఇటీవల మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులను బాల్యమిత్రులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కేజీల బియ్యం, వంట నూనెను అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉబ్బని అశోక్, ఉబ్బని కిషోర్, బళ్లెం రాజశేఖర్, కమటం రాజబాబు, ఉబ్బని శివరాజ్, ఉబ్బని ప్రశాంత్, కమటం రాజశేఖర్, బళ్లెం మనోజ్, ఉబ్బని ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.