TG24TV
రచయిత
గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
TG24TV
రచయిత
గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

వర్ధన్నపేట, జూలై 07 (టీజీ 24): హనుమకొండ జిల్లా మడికొండ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ గురుకుల పాఠశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థినిపై కుక్కల దాడి ఘటనను గోప్యంగా ఉంచడంపై సిబ్బందిని మందలించారు. ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు అందజేయగా, బెడ్స్ ఏర్పాటుకు కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల పరిసరాల్లో కుక్కల బెడదను వెంటనే నివారించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న నాయక్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, జోనల్ అధికారి అపర్ణ, డీసీవో సుధ, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.