T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట, జూలై 07 (టీజీ 24): వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మంగళవారం మడికొండలోని 44, 45, 46, 64 డివిజన్ల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.