T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాట్రపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కాట్రపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కాట్రపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి, జూలై 08 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన మౌలిక వసతులు, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.