T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వరంగల్, జూలై 07 (టీజీ 24: వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతా రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పాలకుర్తి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని ఎమ్మెల్యే కోరగా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని కమిషనర్ తెలిపారు.