T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కొండూరు లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కొండూరు లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కొండూరు లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి, జూలై 08 ( టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గిరాగాని రాజు తండ్రి అనారోగ్యంతో ఉండటంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.