T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

 ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

రాయపర్తి, జూలై 07 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వశపాక కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల ఇంచార్జ్ వేల్పుల సూరన్న కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మందకృష్ణ మాదిగ సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.