T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాకాల సరస్సులో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాకాల సరస్సులో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి

వరంగల్, నవంబర్ 07 (టీజీ 24): వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల సరస్సులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గీసుగొండ మండలం ఎక్కుర్తి హవేలి గ్రామానికి చెందిన ఈరెల్లి మమత (30), తన ఇద్దరు కుమార్తెలు హారిక (4), హరిణి (6)తో కలిసి సరస్సులో మృతి చెందారు. కుటుంబ కలహాలు, వేధింపులే ఘటనకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఖానాపూర్ ఎస్సై రామ్మోహన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.