T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వర్ధన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన నరుకుడు ఎలీషా

వర్ధన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన నరుకుడు ఎలీషా

వర్ధన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన నరుకుడు ఎలీషా

వర్ధన్నపేట, జూలై 08 (టీజీ 24): వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోశాల వెంకన్న గౌడ్ ఇటీవల వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నరుకుడు ఎలీషా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పోశాల వెంకన్న గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతో మండలంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మరుపట్ల సాయికుమార్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు చెంగల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.